Header Banner

సింహాచలం ఘటన.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..! ఏడుగురు సస్పెండ్!

  Tue May 06, 2025 09:04        Politics

ప్రముఖ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధిలో చందనోత్సవంలో ఘోర అపశ్రుతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. శ్రీ వరాహలక్ష్మీ శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఈ ఘటనపై సీఎం చంద్రబాబు త్రిసభ్య కమిషన్ ను విచారణకు ఆదేశించారు. మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన, ఈగల్‌ విభాగాధిపతి ఐజీ రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు సభ్యులుగా త్రిసభ్య కమిషన్ విచారణ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా పలు సంచలన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. గోడను పునాదులు కుడా లేకుండా నిర్మించారు.

వర్షపు నీరు వెళ్లేందుకు కనీసం గోడకు లీప్ హోల్స్ కూడా పెట్టలేదని తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అప్పన్న చందనోత్సవానికి 7 రోజుల ముందు ఈ గోడను హడావిడిగా నిర్మించినట్టు తేలిందని స్పష్టం చేసింది. గోడ నిర్మించే సమయంలోనూ ఎలాంటి తనిఖీలు చేయలేదని త్రిమెన్ కమిషన్ అభిప్రాయ పడింది. దీంతో సింహాచలం ఘటనపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణ కమిటి ఆధారంగా ఏడుగురు ఉన్నతాధికారులపై సస్పెషన్ వేటు వేసింది. దేవాదాయ, పర్యాటక శాఖలకు చెందిన ఏడుగురు అధికారులపై సస్పెషన్ వేటు పడింది.

సస్పెషన్ వేటు పడిన వారిలో.. సింహాచల దేవస్థానం డిప్యూటీ ఈఈ మూర్తి, జేఈ బాబ్జీ, ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈ స్వామి, ఏఈ మదన్ మోహన్ ఉన్నారు. కాంట్రాక్టర్ లక్ష్మినారయణను బ్లాక్ లిస్టులో పెట్టింది ప్రభుత్వం. కాంట్రాక్టర్ తో పాటు ఇద్దరు అధికారులపైనా క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. సింహాచలం లక్ష్మీనరసింహ స్వామివారికి ప్రతి సంవత్సరం చందనోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో నిజరూప దర్శనం ఇస్తారు. నిజరూప దర్శనం చేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉన్న ఒడిశా నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఏడాది చందనోత్సవానికి దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అంచనాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండిఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #SimhachalamTragedy #APGovernmentAction #DevoteeDeaths #OfficialsSuspended #TempleNegligence